న్యూఢిల్లీ: నీట్ యూజీ-2025 ఫలితాలను మళ్లీ రిలీజ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది. ఓ ప్రశ్నలో తప్పు తలెత్తిన నేపథ్యంలో ఆ ఫలితాలను మళ్లీ ప్రచురించాలని కోరుతూ పిటీషన్ దాఖలైంది. జస్టిస్ పీఎస్ నర్సింహా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై తీర్పునిచ్చింది. రెండు రోజుల క్రితమే ఇలాంటి పిటీషన్‌ను తిర్కసరించినట్లు ధర్మాసనం తెలిపింది. వ్యక్తిగత పరీక్షలతో డీల్ చేయలేదని కోర్టు చెప్పింది. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు ఉన్న విషయాన్ని అంగీకరిస్తామని, కానీ లక్షల మంది రాసిన పరీక్షల్లో జోక్యం చేసుకోలేమని, ఇదేమీ వ్యక్తిగ కేసు కాదు అని, వేల మంది విద్యార్థులు దీని వల్ల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది.
నీట్ యూజీ పరీక్ష పత్రంలో తప్పుడు ప్రశ్న వచ్చిందని, ఆ తప్పును సరి చేసి, మళ్లీ ఫలితాలను రిలీజ్ చేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కౌన్సింగ్ ప్రక్రియను ఆపేందుకు స్టే ఇవ్వాలంటూ కోర్టును కోరారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.