Prashant Kishor: ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.. ప్రశాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్రహం
Prashant Kishor: ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సూరజ్ పార్టీ దాఖలు చేసిన పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బీహార్ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని పీకే తన పిటీషన్లో కోరారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని, ఇప్పుడు పబ్లిసిటీ కోసం పిల్ వేస్తున్నారా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor)కు చెందిన జన్ సూరజ్ పార్టీ దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ ప్రశాంత్ కిషోర్ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం తన సంక్షేమ పథకంతో ఓటర్లకు డబ్బులు పంచిందని జన్‌సూరజ్ పార్టీ ఆరోపించింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను కొట్టిపారేసింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని, ఇప్పుడు మీరు పబ్లిసిటీ కోసం న్యాయ ప్రక్రియను వాడుకుంటారని చీఫ్ జస్టిస్ అన్నారు. మీకెన్ని ఓట్లు వచ్చాయి, ఒకసారి ప్రజలు తిరస్కరిస్తే, రిలీఫ్ కోసం జుడిషియల్ ఫోరంను వాడుతున్నారని, ఆ స్కీమ్‌ను ఎవరో ఒకరు ముందుగా ఛాలెంజ్ చేసి ఉండాల్సిందని కోర్టు పేర్కొన్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సూరజ్ పార్టీ మొత్తం 238 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఆ పిల్‌ను బీహార్ హైకోర్టుకు పంపింది సుప్రీం. కుటంబంలోని మహిళకు పదివేలు ఇవ్వడాన్ని పార్టీ తప్పుపట్టింది. ఆర్టికల్ 32 కింద తన పిటీషన్ ఫైల్ చేసింది. సుమారు 36 లక్షల మంది మహిళలకు డబ్బులు రిలీజ్ చేసి అధికార పార్టీ అక్రమ విధానాలకు పాల్పడినట్లు జన్‌సూరజ్ తన పిటీషన్లో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

