న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. జీవితకాల శిక్ష అనుభవించి, శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న దోషులను విడిచి పెట్టాలని ఆదేశించింది. సుఖ్దేవ్ పెహల్వాన్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది. 2002లో జరిగిన నితీశ్ కటారా మర్డర్ కేసులో సుఖ్దేవ్ దోషిగా శిక్షను అనుభవించాడు. అయితే 20 ఏళ్ల శిక్షాకాలాన్ని అతను పూర్తి చేసుకున్నాడని, అతన్ని జైలు నుంచి రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సుఖ్దేవ్ పెహల్వాన్ లాంటి దోషులు.. నిర్దేశిత కాలం వరకు శిక్షను అనుభవించి ఉంటే, వాళ్లను రిలీజ్ చేయాలని కోర్టు తన తాజా తీర్పులో వెల్లడించింది. జైలు శిక్షా కాలాన్ని తగ్గించేందుకు రెమిషన్ అవసరం లేదని కోర్టు చెప్పింది.