న్యూఢిల్లీ : పారిశుద్ధ్య కార్యక్రమాల్లో, మురుగునీటి కాలువలను శుభ్రపరచడంలో మానవులను వినియోగించడంపై సుప్రీంకోర్టు ఈ నెల 29న నిషేధం విధించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు మెట్రో నగరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.
బలరామ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలను ఇచ్చింది. ఈ పనుల కోసం మానవులను వినియోగించడాన్ని నిలిపేయడానికి చేపడుతున్న చర్యలను ఫిబ్రవరి 13లోగా తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది.