న్యూఢిల్లీ, ఆగస్టు 22 : ఓ వార్తా కథనంపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్కి సంబంధించి ది వైర్ న్యూస్ పోర్టల్లో పనిచేస్తున్న కన్సల్టింగ్ ఎడిటర్తోసహా సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్, ఇతర జర్నలిస్టులపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అస్సాం పోలీసులను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
అత్యున్నత న్యాయస్థానం గతంలో జారీచేసిన ఉత్తర్వులను అస్సాం పోలీసులు ఉల్లంఘిస్తున్నారంటూ జర్నలిస్టుల తరఫున సీనియర్ న్యాయవాది నిత్య రామకృష్ణన్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.వారిని అరెస్టు చేస్తారన్న అనుమానాలు ఉన్నట్లు తెలిపారు.