న్యూఢిల్లీ: ఎన్నికల్లో వందశాతం వీవీప్యాట్ల లెక్కింపును తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. న్యాయవాది, ఉద్యమకారుడు అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్లతో పాటు విచారణ జరపాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన ఐదు ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చుతున్నారు. అలా కాకుండా వంద శాతం వీవీప్యాట్లను లెక్కించాలని పిటిషనర్ కోర్టును కోరారు.