Supreme Court | నీట్ పేపర్ లీకేజీ ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్లు ఎత్తివేత.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
Supreme Court : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Supreme Court : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆందోళనల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు భారీ ఊరట లభించినట్లైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది. ఢిల్లీ, అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ పరిధిలో జంతర్మంతర్ వద్ద జూలై 20-25 వరకు జరిగిన నిరసనలపై 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయితే, ఈ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి కేసులు ఉండవు. కానీ, ఈ నిర్ణయం అందరికీ వర్తించదు. గతంలో క్రిమినల్ కేసులు ఉన్నవారిపై మాత్రం ఎఫ్ఐఆర్లు కొనసాగుతాయి. అలా, 2,873 మందిపై నమోదైన ఎఫ్ఐఆర్లు మాత్రం కొనసాగుతాయని కోర్టు తెలిపింది.
నీట్ ఆందోళనలపై అన్ని రాష్ట్రాల్లో నమోదైన కేసులు కొట్టివేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించే విషయంపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. పరిహారం అందించేందుకు మూడు నెలల్లో విధి విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపినట్లు కోర్టు వ్యాఖ్యానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

