సహకార సంఘం ఎన్నికలు నిర్వహించండి
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రస్తుత పాలకవర్గాలనే కొనసాగించాలని పీఏసీఎస్ రాష్ట్ర ఫోరం శనివారం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.
- ఆ శాఖ కమిషనర్‌కు పీఏసీఎస్ ఫోరం నేతల వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రస్తుత పాలకవర్గాలనే కొనసాగించాలని పీఏసీఎస్ రాష్ట్ర ఫోరం శనివారం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ రాహుల్‌రాజ్‌కు ఫోరం ప్రతినిధులు లేఖ ద్వారా విన్నవించారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 నిబంధనల మేరకు ప్రతి ఐదేండ్లకు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నదని లేఖలో గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 908 పీఏసీఎస్ సంఘాలు ఉండగా, వీటికి 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయని, వాటి పదవీకాలం ముగిసి సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల ప్రాధికార సంస్థకు ప్రతిపాదనలు పంపకపోవడం దారుణమని పేర్కొన్నారు.
అయితే, ఎలాంటి కారణాలు లేకుండా చట్టవిరుద్ధంగా పాలకవర్గాలను రద్దు చేస్తూ అధికారులు జీవో-597 జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించినట్టు ఫోరం నేతలు గుర్తుచేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సదరు జీవోపై స్టే విధించి, జీవో-386ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీంతో 2026 మే 4న 908 సొసైటీల పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటికీ, అధికారులు ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించడంలో తాత్సారం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు.
సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం, పాలకవర్గాలకు అధికారాలు లేకపోవడంతో నాబార్డ్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, రాయితీలు రైతులకు అందడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించి సొసైటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

