Mahua Moitra | డబ్బులకు ప్రశ్నలకు సంబంధించిన కేసులో లోక్‌సభ నుంచి బహిష్కరించడంపు టీఎంసీ నేత మహువా మోయిత్రా దాఖలు చేసిన పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రెండురోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు మార్చిలో విచారణ జరుపనున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డబ్బులకు డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగిన కేసులో మహువా మోయిత్రాను లోక్‌సభలో బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, తనను తొలగించాలని సిఫారసు చేసిన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ తగిన సాక్ష్యాలను లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె ఆరోపించారు. మహువా మోయిత్రా పిటిషన్లో అనర్హతను సవాల్ చేస్తూ ఎథిక్స్ కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా లోక్‌సభలో తనను సమర్థించుకునేందుకు అనుమతించలేదని ఆరోపించారు.