న్యూఢిల్లీ: ముస్లిం మహిళా (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం, 1991 ఉల్లంఘిస్తూ తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన పురుషులపై ఎన్ని ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు నమోదు చేశారో వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ట్రిపుల్ తలాక్ పాటింపును నేరంగా పరిగణించే 2019 చట్టం రాజ్యాంగపరమైన చెల్లుబాటును సవాలుచేస్తూ వివిధ వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన 12 పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 2019 చట్టంలోని సెక్షన్ 3, 4 కింద పెండింగ్లో ఉన్న ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్ల సంఖ్యను తెలియచేయాలని ప్రతివాది(కేంద్రం)ని ధర్మాసనం ఆదేశించింది. న్యాయపరమైన వైఖరిని స్పష్టం చేస్తూ ట్రిపుల్ తలాక్ చెల్లదని చట్టం చెబుతున్న తర్వాత వివాహాన్ని రద్దు చేసే అవకాశమే లేదని, ఇప్పుడు తమ తీర్పు చట్టం అమలు తీరుపైనేనని ధర్మాసనం పేర్కొంది.