న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశంలో ఒకే రోజు ఏడు దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అమెరికా, సింగపూర్ వెళ్లే విమానాలు సహా ఏడింటికి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎక్స్ మాధ్యమం ద్వారా ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్ని విమానాలను ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే విమానాన్ని కెనడాకు మళ్లించారు. రెండు రోజుల్లో 10 బాంబు బెదిరింపులు రావడంతో ముమ్మర తనిఖీలు జరిపారు.