న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర కార్టూన్లను వేసిన కార్టూనిస్టు హేమంత్ మాల్వియా(Hemant Malviya)కు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని ఇవాళ కోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో మోదీ, ఆర్ఎస్ఎస్పై వివాదాస్పద కార్టూన్లు వేసిన హేమంత్ మాల్వియాకు రక్షణ కల్పిస్తున్నట్లు కోర్టు తెలిపింది. జస్టిస్ సుధాన్షు దులియా, అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మళ్లీ అదే రీతిలో అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో పోస్తు చేస్తే, చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు అని తన ఆదేశాల్లో ధర్మాసనం తెలిపింది. కార్టూనిస్టు హేమంత్ మాల్వియాకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దు అని జూలై 3వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సుప్రీంలో సవాల్ చేశారు.