న్యూఢిల్లీ : ఓ హత్య కేసులో దోషికి సుప్రీంకోర్టు అతని వయసును దృష్టిలో ఉంచుకుని పర్మనెంట్ బెయిల్ ఇస్తూ కేసును కొట్టేసింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన రసిక్ చంద్రా మొండల్ 1994లో హత్య కేసులో దోషిగా తేలడంతో జైలుకెళ్లాడు. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ తనకు వృద్ధాప్య సమస్యలున్నాయని బెయిల్ ఇవ్వాలని కోరారు. చివరికి 2024 నవంబర్ 29న బెయిల్ ఇవ్వగా ఆయన బయటకొచ్చాడు.
ఈ కేసు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు రాగా.. మొండల్ (105) తన వయసు రీత్యా ఉపశమనం కల్పించాలని కోరాడు. కేసు విచారించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ, వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఆయనకు ఉపశమనం కల్పించింది. ఇది వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్నే అంతిమ తీర్పుగా భావిస్తూ కేసును కొట్టేస్తున్నట్టు తెలిపింది. యావజ్జీవ కారాగార శిక్ష పూర్తి కాకపోయినా ఇక అదుపులోకి తీసుకోవద్దని సూచించింది. అతను ఇకపై స్వేచ్ఛగా జీవించొచ్చని పేర్కొంది.