హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తేతెలంగాణ) : శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధ్దాలను వల్లెవేస్తున్నట్టు మరోసారి నిరూపితమైంది.బీఆర్ఎస్ పార్టీని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బదనాం చేయడమే లక్ష్యంగా బుధవారం మరో విషప్రచారానికి ఒడిగట్టారు. సోషల్ మీడి యాలోని ఓ ఫేక్ ఖాతాలో కేసీఆర్‌ను బదనాం చేసేలా ఒక కామెంట్‌ను పోస్టు చేయించి దాన్ని సభలో చదివి ప్రజల్లో తప్పుడు అభిప్రాయం తెచ్చే ప్రయత్నం చేశారు. నిన్న ఎర్రవల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ నివాసం వద్ద చేసిన హైడ్రామాను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు సభలో సీఎం అబద్ధాల ప్రచారానికి తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం సంబంధంలేని, కాంగ్రెస్ ప్రేరేపిత, కాంగ్రెస్ పార్టీ ప్రాయోజిత ఎక్స్ (ట్విట్టర్ ) ఖాతాలో సంధ్యారావు బీఆర్ఎస్ పేరుతో ఒక ఖాతాను తెరిచారు. ఆ నకిలీ ఖాతా ద్వారా బీఆర్ఎస్ పార్టీపై కొంత కాలంగా కాంగ్రెస్ విషప్రచారం చేస్తున్నది.
నిన్నటి ఘటనపై కూడా ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్లేలా కొన్ని అంశాలను ఆ ఖాతా ద్వారా ప్రచారం చేశారు. ఆ ఖాతాలో పేరొన్న అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో బుధవారం చదివి వినిపించారు. సభలో సీఎం మాట్లాడుతూ ‘కుట్రలో భాగంగా కేసీఆర్ ఉన్మాదిగా మారి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాన్ని నేను చెప్పడం లేదు.. సంధ్యారావు బీఆర్ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి చెప్తున్నారు. ’కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దళితులు అడుగుపెట్టిన నివాసం చుట్టూ ఉన్న నేలంతా మైలపడటంతో పసుపు నీటితో శుద్ధి చేయడం జరిగింది’ అని అందులో చెప్పారు అని సీఎం సభలో చెప్పారు. ఎవరైనా చూస్తే ఇది నిజమే అనుకుంటారు. కానీ, వాస్తవాల కోసం ఎక్స్ ఖాతాను పరిశీలించగా ఆ ఖాతాను సీఎం ప్రకటన తర్వాత నిలిపివేశారు. ఆఖాతాలో ఉన్న అంశాలను పరిశీలిస్తే పకా కాంగ్రెస్ స్పాన్సర్ అకౌంట్‌గా తెలిసిపోతున్నది. పేరుకు బీఆర్ఎస్ అని పెట్టి దాంట్లో అన్ని బీఆర్ఎస్కు వ్యతిరేకమైన పోస్టులు మాత్రమే చేశారు.