అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ పరువుకు భంగం కలిగించడమే కాకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.
శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధ్దాలను వల్లెవేస్తున్నట్టు మరోసారి నిరూపితమైంది.బీఆర్ఎస్ పార్టీని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బదనాం చేయడమే లక్ష్యంగా బుధవారం మరో విషప్రచారానికి ఒడిగట్టారు.