న్యూఢిల్లీ: గత నెలలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల సందర్భంగా జరిగిన హింస, పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ(హెచ్పీసీ)ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆందోళనకారులపై హింస, లైంగిక వేధింపులపై ఈ కమిటీ పరిశీలిస్తుంది. పోలీసుల బలప్రయోగం దామాషా నిష్పత్తిలో ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిగణిస్తుంది.
ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి శంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలీందర్ కౌర్, మాజీ సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్ఆర్ బిష్ణోయ్ సభ్యులుగా ఉన్నారు.