న్యూఢిల్లీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో హైకోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను సవాల్చేసిన ఈడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఈడీ కేసులో సొరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత, జార్ఖండ్ సీఎంగా సొరేన్ మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. సరైన కారణాలతోనే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సొరేన్‌కు బెయిల్ మంజూరు చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.