న్యూఢిల్లీ : నోట్ల కట్టల కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అంతర్గత కమిటీ సిఫారసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
ఇన్‌హౌస్ కమిటీని ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని విశ్వసించినట్లయితే, దానిని ఏర్పాటు చేసినపుడే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇన్‌హౌస్ కమిటీని నియమించడం చట్టవిరుద్ధమైనవి కాదని స్పష్టం చేసింది.