న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపుపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదవీ కాలం పెంచడం, ఆ పెంపును ఐదేండ్ల వరకు పొడిగించొచ్చంటూ చట్టంలో సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సంస్థ స్వతంత్రంగా వ్యవహరించేందుకే పరిమిత కాలపరిమితి విధించారని, ఇప్పుడు దాన్ని తీసేయడమంటే సంస్థ స్వతంత్రతకు విఘాతం కలిగించినట్టేనని పిటిషనర్ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వి వాదించారు.