న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు చీఫ్ జస్టిస్లను సుప్రీం కోర్టు జడ్జీలుగా సుప్రీం కోర్టు కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆగస్టిన్ జార్జి మాసిహ్, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ సందీప్ మెహతా పేర్లను సిఫార్సు చేస్తూ కేంద్రానికి పంపింది.