Supreme Court | మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని.. తదుపరి విచారణ సమయంలో పిటిషన్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మే 28న హైకోర్టు బెయిల్ పిటిషన్‌పై ఈడీ స్పందన కోరింది. ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని సూచించింది. విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేందర్ జైన్‌పై 2017లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను 2022 30న అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో 2019లో సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.