Home
National
Supreme Court Allows Reassessment Of Former Cji Y K Sabharwals Sons Income Tax Returns
మాజీ సీజేఐ కుమారుల పన్ను మదింపులపై రివ్యూ
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వై కే సబర్వాల్ కుమారులు చేతన్, నితిన్ సబర్వాల్ల ఆదాయపు పన్ను మదింపుల పునః పరిశీలనకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వై కే సబర్వాల్ కుమారులు చేతన్, నితిన్ సబర్వాల్ల ఆదాయపు పన్ను మదింపుల పునః పరిశీలనకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. షేర్ల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ముతో 2010లో ఢిల్లీలోని సికంద్రా రోడ్డులో విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పునః మదింపు నోటీసులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
జస్టిస్ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం చేతన్, నితిన్ సబర్వాల్ దాఖలు చేసిన నాలుగు అప్పీళ్లను కొట్టివేసింది. 2008-09, 2009-10 మదింపు సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటీసులు చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

