బిటన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ఉగ్రవాద సంస్థలు!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న వేళ బ్రిటన్‌కు చెందిన నేవీ, రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద సంస్థలుగా ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా బ్రిటన్ విదేశీ నిఘా సంస్థ ఎంఐ6ను శత్రు సంస్థగా తీర్మానించింది.
టెహ్రాన్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న వేళ బ్రిటన్‌కు చెందిన నేవీ, రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద సంస్థలుగా ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా బ్రిటన్ విదేశీ నిఘా సంస్థ ఎంఐ6ను శత్రు సంస్థగా తీర్మానించింది. అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలకు బ్రిటన్ సహకరిస్తున్నదని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఇరాన్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది.
తమపై జరుగుతున్న కార్యకలాపాలకు బ్రిటన్ సైనిక స్థావరాలు, ఇతర సౌకర్యాలను అందిస్తున్నదని టెహ్రాన్ ఆరోపించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్సీజీ)ను బ్రిటన్ గత జూలైలో స్టేట్ థ్రెట్స్ యాక్ట్ 2026 పరిధిలోకి తీసుకురావడాన్ని కూడా ఇరాన్ ప్రస్తావించింది. లండన్ చర్యలు తమ దేశానికి వ్యతిరేకంగా సాగుతున్న శత్రుత్వ చర్యలని పేర్కొంది. తాజా నిర్ణయంతో ఇరాన్, బ్రిటన్ మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

