Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 30 : సమాఖ్య వ్యవస్థలో ప్రతి విభాగానికి గుర్తింపు, పరిధి ఉండేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రూ.20 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అంకిత్ తివారిపై తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్(డీవీఏసీ) కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారించింది. ‘సమాఖ్య స్ఫూర్తిలో ప్రతి విభాగానికి గుర్తింపు, పరిధి ఉండేలా చూసుకోవాలి. కేంద్ర అధికారులను రాషా ్ర్టలు ఏకపక్షంగా అరెస్టు చేయడం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయొ చ్చు. ఈ అధికారం రాష్ర్టాలకు ఉందని చెప్పడం సమాఖ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారొచ్చు. అలాగని రాష్ట్ర పోలీసులు వారి పరిధిలో విచారణ జరిపే అధికారాన్ని కాదనడం కూడా సరి కాదు’అని ధర్మాసనం పేర్కొంటూ విచా రణను వచ్చే నెలకు వాయిదా వేసింది.