న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశవ్యాప్తంగా 21 ప్రఖ్యాత దవాఖానల్లో ‘సూపర్‌బగ్స్’ ఉన్నాయని, అక్కడ వైద్య సేవలు పొందుతున్న రోగుల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) తాజా నివేదిక హెచ్చరించింది. ఎయిమ్స్ ఢిల్లీ, పీజీఐ-చండీగఢ్, అపోలో దవాఖాన-చెన్నై, గంగారామ్ దవాఖాన-ఢిల్లీ.. తదితర దవాఖానాల్లో రోగుల రక్తం, మూత్రం నమూనాల్లో సూపర్‌బగ్స్ ఉన్నట్టు గుర్తించామని నివేదిక తెలిపింది.
యాపిల్‌కు 1.2 లక్షల కోట్లు జరిమానా
న్యూఢిల్లీ: యాపిల్‌కు యూరప్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్ నుంచి పొందిన 14.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.2 లక్షల కోట్లు) పన్ను ప్రయోజనాలను తిరిగి ఆ దేశానికి చెల్లించాలంటూ ఈసీజే తీర్పు చెప్పింది.