Sunny Leone | సన్నీ లియోన్ అకౌంట్లోకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిధులు
వివాహిత మహిళల కోసం ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వ పథకంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన్ యోజన పథకం కింద ప్రముఖ నటి సన్నీ లియోన్ (Sunny Leone) ప్రతి నెల రూ.1000 అందుకున్నారు.
రాయ్‌పూర్: వివాహిత మహిళల కోసం ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వ పథకంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన్ యోజన పథకం కింద ప్రముఖ నటి సన్నీ లియోన్ (Sunny Leone) ప్రతి నెల రూ.1000 అందుకున్నారు. ఆమె అకౌంట్లోకి నేరుగా నగదు జమ అవుతున్నది. ఇప్పుడీ విషయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగుతున్నది. పథకం నిధులు దారిమళ్లుతున్నాయని, అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతున్నదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా సాధికారత కోసం మహతారి వందన్ యోజన పేరుతో వారి ఖాతాల్లోకి నెలకు రూ.వెయ్యి బదిలీ చేస్తున్నది. ఈ క్రమంలో వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్ పేరుతో అకౌంట్ తెరచినట్లు గుర్తించారు. బస్తర్ రీజియన్‌లోని తూలూర్ చిరునామాతో బ్యాంక్ ఖాతా ఉన్నదని, ఆమె భర్త పేరు జానీ సిన్స్గా పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. గత మార్చి నుంచి ప్రతి నెల రూ.1000 చొప్పున ఆ ఖాతాలో డిపాజిట్ అవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ అకౌంట్‌ను సీజ్ చేయాలని బస్తర్ జిల్లా కలెక్టర్ హారిస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిందితుని నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

