ముంబై, ఆగస్టు 20: బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ విల్లాను ఈనెల 25న ఈ-వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆదివారం ప్రకటించింది. సన్నీ డియోల్ 2022 డిసెంబర్ నుంచి జరిమానా, వడ్డీతో సహా మొత్తం రూ.55.99 కోట్ల రుణం బాకీ పడ్డారని పేర్కొన్నది. దీనికి సంబంధించి ముంబైలోని జూహూ ప్రాంతం లో ఉన్న ఆయన విల్లాను రూ.51.43 కోట్ల రిజర్వ్ ధరకు వేలం వేస్తున్నట్టు చెప్పింది. విల్లాతో పాటు 599.44 చ.మీలలో ఉన్న సన్నీ డియోల్, ఆయనకు వ్యక్తిగత గ్యారంటీదారుగా ఉన్న ఆయన తండ్రి ధర్మేంద్ర భవనాలను కూడా వేలం వేస్తున్నట్టు వేలం నోటీస్‌లో పేర్కొంది.