న్యూఢిల్లీ: ‘ఐఎస్ఎస్’లోని వ్యోమగాములు కొత్త సంవత్సరంలోకి ఎలా అడుగుపెడతారన్న దానిపై అక్కడే ఉన్న సునీతా విలియమ్స్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఐఎస్ఎస్లోని 9మంది వ్యోమగాములు నూతన సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకుంటున్నామని, న్యూఇయర్ వేడుకను 16 మార్లు జరుపుకుంటున్నామని ఆమె ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఐఎస్ఎస్ కేంద్రంలోని వ్యోమగాములు 16 సార్లు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూశాకే.. 2025లోకి ప్రవేశిస్తారని ఆమె వివరించారు. 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ కేంద్రం వద్ద ప్రతి 90 నిమిషాలకోమారు సూర్యోదయం చూడొచ్చునట.