Arvind Kejriwal : లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుతో 6 పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలకానున్నారు. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసుకు సంబంధించి పెదవివిప్పరాదని, కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇక ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. కేజ్రీవాల్ వెన్నంటి దృఢంగా నిలిచినందుకు ఆప్ కుటుంబానికి ఆమె అభినందనలు తెలిపారు. జైలులో ఉన్న ఇతర నేతలకు కూడా వారి విడుదల సందర్భంగా ఆమె ఎక్స్ పోస్ట్‌లో అభినందనలు తెలియచేశారు. ఇక కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్వాగతించారు. సుప్రీంకోర్టుకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని, కేజ్రీవాల్ ఓ పేరు కాదని, నిజాయితీతో కూడిన రాజకీయాలకు ఆయన ఓ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్‌కు ప్రజల్లో ఆదరణ పెరగినందుకే ఆయనను 6 నెలల పాటు జైల్లో నిర్బంధించారని అన్నారు. కేజ్రీవాల్ రాకతో ఆప్ మరింత బలోపేతమవుతుందని, అరవింద్ కేజ్రీవాల్‌ను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. బెయిల్ షరతులను పూర్తిగా తీర్పు కాపీలో చదివిన అనంతరం తమ తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తామని చెప్పారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇక రానున్న హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి కేజ్రీవాల్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. అసత్యాలు, కుట్రలపై సత్యం జరిపిన పోరాటం మరోసారి విజయం సాధించిందని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోసియా వ్యాఖ్యానించారు.
Read More :
Kaushik Reddy | కాంగ్రెస్ వాళ్లకు ఓ చట్టం.. తమకో చట్టమా: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి