సిమ్లా, డిసెంబర్ 11: హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ ఆదివారం ప్రమాణం చేశారు. ఆయన చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సుఖ్విందర్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా తొలి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వాన్ని పారదర్శకంగా, నిజాయితీగా నడిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు. అటు.. గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణం చేయనున్నారు.