ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హార్బర్ లైన్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. కానీ విఫలమైంది. రైలు పట్టాల పక్కన ఉన్న సదరు యువకుడు.. రైలు రావడాన్ని గమనించి.. పట్టాలపై పడుకున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన లోకో పైలట్ రైలును యువకుడికి కొద్ది దూరంలోనే ఆపాడు. ప్లాట్ ఫాం వద్ద ఉన్న రైల్వే పోలీసులు.. యువకుడిని గమనించి అక్కడకు పరుగెత్తారు. అనంతరం బాధిత యువకుడిని చేరదీసి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు.
#Mumbai Belapur local on harbour line. Suicide attempt foiled. Monday, 27 December, Sewri station. @mid_day pic.twitter.com/Pfo1pLoIMh
— Rajendra B. Aklekar (@rajtoday) December 29, 2021