న్యూఢిల్లీ : పిల్లల పెంపకంపై రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఆసక్తికర సూచనలు చేశారు. ప్రీ ప్రైమరీ విద్యపై భారత్లోని తల్లిదండ్రులు దృష్టి సారించాలని చెప్పారు. మూడేండ్ల నుంచే పిల్లలను స్కూళ్లకు పంపాలని వారికి ఆమె సూచించారు. చిన్నతనంలో బ్రష్ చేసుకోవడం, తమకు తామే బ్రేక్ఫాస్ట్ చేయడం వంటివి పిల్లలకు నేర్పితే.. వారి జీవితంలో అదే శాశ్వత దినచర్యగా గుర్తుండిపోతాయని, వారికి క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలిపారు.
చిన్న వయస్సులో ఎలా ఆలోచిస్తారు? అనే దాన్ని బట్టే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. 14 ఏండ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా ప్రభుత్వం విద్యను అందించాల్సి ఉన్నదని, అయితే మూండేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలని ఆమె కోరారు.