భోపాల్: సుదర్శన చక్ర(Sudarshan Chakra) వైమానిక రక్షణ వ్యవస్థ ఏర్పాటు అంశంపై త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో రణ్ సంవాద్ అనే అంశంపై జరిగిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను రూపొందించేందుకు త్రివిధ దళాల సహకారం అవసరం ఉంటుందన్నారు. త్రివిధ దళాల మిలిటరీ సర్వీసులను బలోపేతం చేయాల్సి ఉంటుందన్నారు. మిస్సైళ్లు, నిఘా వ్యవస్థలను బలోపేతం చేస్తేనే.. శత్రుదుర్భేద్యమైన వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ రూపొందించడం వీలు అవుతుందని సీడీఎస్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌కు చెందిన రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ తరహాలోనే సుదర్శన చక్ర తయారు చేస్తున్నట్లు చెప్పారు.
అన్ని రకాల వాతావరణాల్లో పనిచేసే రీతిలో సుదర్శన చక్ర ఉంటుందన్నారు. సమర్థవంతంగా మిస్సైళ్లను అడ్డుకుంటుందన్నారు. యుద్ధంపై సాంకేతికత ప్రభావం అన్న థీమ్‌పై సీడీఎస్ కీలక ఉపన్యాసం చేశారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు సరిహద్దులు ఉండవన్నారు. అన్ని డోమెయిన్ల మధ్య సంయుక్త స్పందన అవసరం అన్నారు. సంయుక్తంగా అన్ని రంగాల్లో శిక్షణ పొందాలన్నారు. ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్, క్వాంటమ్ విధానాలకు పెద్ద పీట వేయాల్సి వస్తుందన్నారు.
CDS Gen Anil Chauhan at #RanSamwad2025 said future wars will not recognise service boundaries & require swift joint responses. He stressed #Aatmanirbharta, integrated logistics, Sudarshan Chakra (India’s Iron Dome), and adoption of AI, Cyber & Quantum, with joint training as the… pic.twitter.com/3dmvvilViA
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) August 26, 2025