న్యూఢిల్లీ: ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) తొలి పరీక్ష విజయవంతమైంది. దీంతో భారత దేశ గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఈ నెల 23 మధ్యాహ్నం 12.30 గంటలకు ఒడిశా తీరంలో ఈ పరీక్షలను నిర్వహించింది. ఐఏడీడబ్ల్యూఎస్ అంటే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ.
మన దేశంపైకి వచ్చే ఆయుధాలను అడ్డుకుని, ధ్వంసం చేయడానికి రకరకాల ఇంటర్సెప్టర్లు దీనిలో ఉంటాయి. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్, హై పవర్ లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ దీనిలో ఉంటాయి. వీటన్నిటినీ మన దేశంలోనే తయారు చేశారు.