
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పరిధిని మరింత విస్తృత పరిచిన పినాక-ఈఆర్ రాకెట్ వ్యవస్థ పరీక్షలు విజయవంతమైనట్టు రక్షణ శాఖ తెలిపింది. రాజస్థాన్లో పొఖ్రాన్లో మూడు రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించామని, మొత్తం 24 రాకెట్లను వివిధ వార్హెడ్ల సామర్థ్యంతో, పలు రేంజ్లలో పరీక్షించామని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పినాక పరిధిని పెంచి పినాక-ఈఆర్గా తీర్చిదిద్దామని పేర్కొంది.