న్యూఢిల్లీ, జనవరి 18: వంటగ్యాస్ సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే వర్తింపజేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు సబ్సిడీ వర్తింపజేయకపోవడాన్ని పిటిషనర్ ఆకాశ్ గోయల్ ప్రశ్నించారు. ఈ పిటిషన్ ఫిబ్రవరి 13న విచారణకు రానుంది. వంట గ్యాస్‌పై ఇదివరకు ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం ఉజ్వల లబ్ధిదారులకు మాత్రమే సిలిండర్‌పై రూ.200 రాయితీ ఇస్తున్నది. మిగతా పేదలకు ఇవ్వడం లేదు. ఇది చట్టవిరుద్ధం, వివక్షా పూరితమని పిటిషనర్ ఆరోపించారు.