LPG Gas Cylinder | రాయితీకి కత్తెర వేసిన మోదీ సర్కార్.. ఇక నాలుగు సిలిండర్లకే సబ్సిడీ!
LPG Gas Cylinder | ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా కనిపిస్తున్నది.
LPG Gas Cylinder | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా కనిపిస్తున్నది. పశ్చిమాసియా ఉద్రిక్తతల పేరిట ఇప్పటికే వంటగ్యాస్ సిలిండర్ల ధరలను దఫాలుగా పెంచుతున్న కేంద్రం.. ఇప్పుడు ఉజ్వల యోజన కింద పేదింటి మహిళలకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యలోనూ భారీగా కోత విధించింది. ఈ విషయాన్ని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
కోత ఇలా..
గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 994గా ఉన్నది. అయితే, పేదింటి మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఉజ్వల యోజన కింద ఒక్కో సిలిండర్‌పై రూ. 300 మేర సబ్సిడీ అందిస్తున్నది. దీంతో ఉజ్వల స్కీమ్‌లోని మహిళలకు ఒక్కో సిలిండర్ రూ. 694కే లభిస్తున్నది. అయితే, ఈ స్కీమ్ కింద ఇప్పటివరకూ ఏడాదికి 9 సిలిండర్ల వరకూ తీసుకొనే వెసులుబాటు ఉండేది. అయితే, తాజా కోతలను అనుసరించి ఏడాదిలో 4 సిలిండర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐదో సిలిండర్ కావాలంటే మొత్తం ధర అంటే రూ. 994 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.
ఒక్కో కుటుంబంపై రూ. 1500 భారం
ఉజ్వల స్కీమ్‌లో భాగంగా గతంలో ఏడాదికి 9 సిలిండర్లకు రూ. 300 చొప్పున సబ్సిడీ వర్తించేది. దీంతో ఒక్కో సిలిండర్‌కు రూ. 694 మాత్రమే చెల్లించేవారు. అలా ఏడాదికి ఒక్కో పేద కుటుంబానికి రూ. 2,700 మేర ఆదా అయ్యేది. అయితే, తాజాగా సబ్సిడీ లిమిట్‌ను 4 సిలిండర్లకే పరిమితం చేయడంతో మిగతా ఐదు సిలిండర్లకు పూర్తి మొత్తం అంటే రూ. 994 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉజ్వల స్కీమ్ పరిధిలోకి వచ్చే ఒక్కో కుటుంబం ఏడాదికి రూ. 1,500 మేర అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని పలువురు వాపోతున్నారు. రాయితీకి కత్తెరేసిన కేంద్రం చర్యలతో పేదోడి బడ్జెట్ తలకిందులయ్యిందని విమర్శిస్తున్నారు.
ఏటా కేంద్రానికి రూ. 15,855 కోట్లు
కిందటి నెల నాటికి ఉజ్వల స్కీమ్ కింద 10.57 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నట్టు కేంద్రప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. తాజా నిర్ణయంతో ఉజ్వల స్కీమ్ పరిధిలోకి వచ్చే ఒక్కో కుటుంబంపై ఏటా పడే రూ. 1,500 అదనపు భారాన్ని లెక్కలోకి తీసుకొంటే, ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 15,855 కోట్లు అదనంగా చేకూరనున్నట్టు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
తొలుత 12.. ఇప్పుడు 4
2016లో ఉజ్వల స్కీమ్ ప్రారంభించారు. అప్పుడు ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీని ఇచ్చేవారు. అయితే, గత ఏడాది ఆగస్టులో ఈ రాయితీ సిలిండర్ల సంఖ్యను 12 నుంచి 9కి కుదించారు. తాజాగా పశ్చిమాసియా సంక్షోభం నెపంతో 4కు తగ్గించారు. అలా మొత్తంగా ఏడాది వ్యవధిలో సిలిండర్ల రాయితీలో 66 శాతం మేర కోత విధించి పేదోడు మళ్లీ కట్టెల పొయ్యికి మళ్లే పరిస్థితిని కేంద్రం తీసుకొచ్చిందని విపక్ష నాయకులు మండిపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

