న్యూఢిల్లీ: ఢిల్లీలోని మూడు స్కూళ్లకు ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపులు సొంత విద్యార్థుల పనేనని పోలీసులు గుర్తించారు. నవంబర్ 28న రోహిణి ప్రశాంత్ విహార్ వద్ద పేలుడు సంభవించిన మరుసటి రోజే వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.
పరీక్షలను వాయిదా పడాలని కోరుకున్న ఇద్దరు తోబుట్టువులు గతంలో తమ బడికి వచ్చిన బాంబు బెదిరింపులను దృష్టిలో ఉంచుకొని బాంబు బెదిరింపు మెయిల్ పంపారు. రోహిణి, పశ్చిమ్ విహార్‌లోని మరో రెండు పాఠశాలల విద్యార్థులు కూడా స్కూళ్లు మూతపడాలనే కోరికతో నకిలీ బాంబు బెదిరింపుల ఈ-మెయిల్స్ పంపారు.