జైపూర్: రాజస్థాన్‌లోని కోటాలో నీట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నిషా యాదవ్(21) ఆత్మహత్య చేసుకున్నది. హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నది. రోజువారీలాగే బుధవారం కూడా తన కుమార్తె నిషాతో మాట్లాడటానికి తండ్రి ప్రయత్నించారు. కానీ ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సిబ్బంది ఆమె గదికి వెళ్లి తలుపుకొట్టినా తీయకపోవడంతో బద్ధలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.