బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. బెంగళూరు యూనివర్సిటీలోని జ్ఞాన భారతి క్యాంపస్లో గణేష్ ఆలయం నిర్మించేందుకు కార్పొరేషన్ పనులు చేపడుతోంది. అయితే వర్సిటీ విద్యార్థులు, లెక్చలర్లు దీనిని వ్యతిరేకిస్తూ శుక్రవారం నిరసనకు దిగారు. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించారు. పురపాలక అధికారుల ఏకపక్ష నిర్ణయం, రాజకీయ ప్రయోజనాలను తప్పుపట్టారు. క్యాంపస్లో ఆలయం నిర్మిస్తే విద్యా వాతావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్లో ఆలయానికి బదులు లైబ్రరీ లేదా తమకు ఉపయోగపడే దానిని నిర్మించాలని డిమాండ్ చేశారు.
కాగా, బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులతోపాటు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ కూడా క్యాంపస్లో వినాయకుడి ఆలయం నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ బృహత్ బెంగళూరు మహానగర పాలిక రాజకీయ ఒత్తిడితో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఆలయం నిర్మాణ పనులు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల అండతో పనులను పర్యవేక్షిస్తున్న స్థానిక అధికారులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, ఘర్షణలు జరిగాయి. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Construction of a #Temple inside premises of #Bengaluru university has been opposed by section of students who are demanding library instead of a temple there. Student body alleges it's a unilateral decision with no consultation done under political influence. #Karnataka pic.twitter.com/cTyvpMZJ4x
— Imran Khan (@KeypadGuerilla) September 8, 2022