కోల్‌కతా, ఆగస్టు 20: పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. బయటి వ్యక్తులను క్యాంపస్‌లోకి తీసుకు వస్తున్నారన్న ఆరోపణలతో ఏబీవీపీ, వామపక్ష సంఘాల విద్యార్థులు గురువారం తెల్లవారుజామున ఘర్షణ పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ వారిని దవాఖానకు తరలించారు. క్యాంపస్‌లో కొన్ని చోట్ల నిప్పు కూడా పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఘర్షణల నేపథ్యంలో అరబిందో భవన్‌కు అధికారులు తాళాలు వేశారు. క్యాంపస్‌లో ఘర్షణ జరగడం దురదృష్టకరమని వీసీ చిరంజిబ్ భట్టాచార్య పేర్కొన్నారు.