బెంగళూరు: బెంగళూరు సమీపంలోని ఏసీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో 7వ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ (21)ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ విద్యార్థి కళాశాలలోని వాష్‌రూమ్‌లో విద్యార్థినుల గౌరవానికి భంగం కలిగిస్తూ వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు.
మొబైల్ ఫోన్లో సుమారు 8 వీడియోలను చిత్రీకరించాడని సహ విద్యార్థులు గుర్తించడంతో విషయం బయటకు తెలిసిందని చెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తమను చంపేస్తానని బెదిరించాడని అతడి స్నేహితులు తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవ్వడంతో నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.