న్యూఢిల్లీ: ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Stray Dogs Attack Woman) ఈ నేపథ్యంలో జారిపడటంతో ఆమె కాలు మెలిపడటంతోపాటు విరిగింది. దీంతో ఆ మహిళను హాస్పిటల్లో అడ్మిట్ చేయగా విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 56 ఏండ్ల అనూ డోగ్రా సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేందుకు అపార్ట్మెంట్ మెట్లపై నుంచి నడిచి కిందకు వచ్చింది. ఇంతలో అక్కడున్న ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఒక కుక్క ఆ మహిళ మీదకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె జారిపడింది. ఈ సంఘటనలో ఆమె కాలు మెలిపడి విరిగింది.
కాగా, కుక్కల దాడిలో గాయపడటంతోపాటు కాలు విరిగిన ఆ మహిళను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆ మహిళను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మరోవైపు ఆ అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिल्ली : आवारा कुत्तों के झपटने से टूटी महिला की पैर की हड्डी, वीडियो देख सिहर जाएंगे
पूरी खबर के लिए पढ़ें:- https://t.co/GDDlvVVhRU pic.twitter.com/HNFXOR1V12
— NDTV India (@ndtvindia) September 15, 2023