న్యూఢిల్లీ: ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. (Stray Bull Attacks Woman) నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురాలు ధైర్యంతో ఆ ఎద్దును ఎదుర్కొన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అక్టోబరు 30న అయా నగర్లోని వీధి నంబర్ 8లో ఒక మహిళ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన సందులో నడుచుకుంటూ వెళ్తున్నది.
కాగా, అక్కడ ఉన్న ఒక ఎద్దు ఉన్నట్టుండి ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. ఆమెను నేలకు నెట్టి కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ మహిళ ఎంతో ధైర్యంతో ఆ ఎద్దును ఎదుర్కొంది. తన చేతులతో ఎద్దు కొమ్ము, దాని నోటిని గట్టిగా పట్టుకున్నది. దీంతో అది దాడి చేయలేకపోయింది.
మరోవైపు సహాయం కోసం ఆ మహిళ కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. కర్రలతో వచ్చి ఆ ఎద్దును తరిమేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఒక వృద్ధుడు ఎద్దు కొమ్ములను పట్టుకుని పక్కకు లాగాడు. గాయపడిన మహిళను పక్కకు తీసుకెళ్లేందుకు మరో వ్యక్తి ప్రయత్నించాడు.
అయితే ఆ వ్యక్తి ఎద్దు కొమ్ములు వదిలేయడంతో అక్కడున్న వారిపై దాడికి అది ప్రయత్నించింది. అయితే కొందరు వ్యక్తులు కర్రలతో బెదిరించడంతో అది అక్కడి నుంచి పరుగుతీసింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
देखिए राह चलते ये हादसा किसी के भी साथ हो सकता है
दिल्ली में एक गुस्सैले आवारा पशु ने महिला को उठाकर पटका और घसीटा, महिला और लोग चीखते चिल्लाते रहे
लोगो ने बचाने की कोशिश भी लेकिन लोगो पर भी हमला कर दिया 📍वीडियो दिल्ली के आया नागर का है pic.twitter.com/xTIsu7DnKj
— Lavely Bakshi (@lavelybakshi) November 6, 2024