న్యూఢిల్లీ: ఆకాశంలో గురువారం రాత్రి మరో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచమంతటా స్ట్రాబెర్రీ మూన్ దర్శనమిచ్చింది. ప్రతి ఏడాది జూన్లో లేదా వసంత రుతువు చివరన వచ్చే పౌర్ణమి రోజు కనిపించే చందమామను స్ట్రాబెర్రీ మూన్ అంటారు. స్ట్రాబెర్రీ మూన్ అంటే స్ట్రాబెర్రీ రంగులో ఉంటుంది అనుకుంటే పొరపాటు. అన్ని పౌర్ణమి రోజుల్లో ఉన్నట్టే వసంత పౌర్ణమి రోజు కూడా ఉంటుంది. కానీ అమెరికాలో స్ట్రాబెర్రీ పంట చేతికి వచ్చే సమయం కాబట్టి జూన్లో వచ్చే పౌర్ణమి చంద్రుడికి స్ట్రాబెర్రీ మూన్ అనే పేరు వచ్చింది. ఒడిశాలోని పూరి, గోవా రాజధాని పనాజీలో స్ట్రాబెర్రీ మూన్ దర్శనమిచ్చిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో చూడవచ్చు.
The last supermoon of the year – #StrawberryMoon – as seen in Puri, Odisha. pic.twitter.com/nljcHVFfmZ
— ANI (@ANI) June 24, 2021
#StrawberryMoon adorns night sky in Panaji, Goa pic.twitter.com/B7CeTcDXRA
— ANI (@ANI) June 24, 2021