man burns wife alive | మద్యం తాగడాన్ని అడ్డుకున్న భార్య.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త
man burns wife alive | మద్యం తాగడాన్ని అడ్డుకున్నందుకు భార్యపై భర్త ఆగ్రహించాడు. ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. (man burns wife alive) ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
లక్నో: మద్యం తాగడాన్ని అడ్డుకున్నందుకు భార్యపై భర్త ఆగ్రహించాడు. ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. (man burns wife alive) ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మునీష్ సక్సేనా అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో కూడా మద్యం సేవించసాగాడు. గమనించిన 40 ఏళ్ల భార్య షానో భర్త ఇంకా మద్యం తాగడాన్ని అడ్డుకున్నది. దీంతో ఆగ్రహించిన సక్సేనా బైక్ నుంచి పెట్రోల్ తీశాడు. భార్యపై పోసి ఆమెకు నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, మంటల్లో కాలుతున్న షానోను కాపాడేందుకు అత్త మున్నీ దేవి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చేతులు కూడా కాలాయి. తల్లి షానో మంటల్లో సజీవ దహనం కావడం చూసి పిల్లలైన 8 ఏళ్ల సన్నీ, ఐదేళ్ల అర్జున్ ఆందోళన చెందారు. కేకలు వేసి పొరుగువారిని అలెర్ట్ చేశారు. దీంతో షోనో మంటలు ఆర్పడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సజీవంగా కాలిన షానో మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలైన అత్తను కూడా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న భర్త సక్సేనాను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

