Rahul Gandhi vs BJP | ఆ సునామీ 2013 లోనే వచ్చింది.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
Rahul Gandhi vs BJP | దేశంలో ‘ఆర్థిక సునామీ (Financial Cricis)’ రాబోతోందని, కీలక వ్యవస్థల్లో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ప్రజా వ్యతిరేకతను అణచి వేయటానికి ఎమర్జెన్సీ (Emergency) ని విధించినా విధించవచ్చని కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్రంగా స్పందించింది.
Rahul Gandhi vs BJP : దేశంలో ‘ఆర్థిక సునామీ (Financial Cricis)’ రాబోతోందని, కీలక వ్యవస్థల్లో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ప్రజా వ్యతిరేకతను అణచి వేయటానికి ఎమర్జెన్సీ (Emergency) ని విధించినా విధించవచ్చని కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్రంగా స్పందించింది. ప్రజలను భయపెట్టి బతుకవద్దని రాహుల్‌కు చురకలు వేసింది. ఆర్థిక సునామీ 2013 లోనే వచ్చిందని, ఇప్పుడు కాదని బీజేపీ నేత అమిత్ మాలవీయ సుదీర్ఘ పోస్టుపెట్టారు.
కాంగ్రెస్ వినాశనాన్ని సృష్టిస్తే బీజేపీ దృఢంగా ముందుకు వెళ్తోందని ఆ పోస్టులో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉందని, ఆర్థిక వ్యవస్థ బయటి నుంచి షాక్ ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ నిస్సహాయంగా లేదుని తెలిపారు. ఈ దశాబ్ద కాలంలో ఆ షాక్‌లను తట్టుకొనే వ్యవస్థలను నిర్మించామని చెప్పారు. విద్యుత్ వినియోగం, వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ-వే బిల్ జనరేషన్లో పెరుగుదల ఉందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆహారం, విదేశీ మారకద్రవ్య నిల్వలు సరిపడా ఉన్నాయని మాలవీయ వెల్లడించారు.
భారత్ దృఢంగా ముందుకు వెళ్తోందనడానికి ఇవన్నీ సంకేతాలని తెలిపారు. 2011 నుంచి 2013 మధ్యలో రూపాయి 36 శాతం కుంగిందని, విదేశీ మారక నిల్వలు 294 బిలియన్ డాలర్ల నుంచి 256 బిలియన్ డాలర్లకు పడిపోయాయని విమర్శించారు. ఆర్థిక సునామీ అప్పుడే వచ్చిందని, కాంగ్రెస్ దేశాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరలు, సరఫరా అంతరాయలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వంటి షాక్‌లు తగిలినా తట్టుకొనేలా దేశాన్ని మోదీ ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపారు. ప్రజలను భయపెట్టి బతకవద్దని అని ఎక్స్ వేదికగా రాహుల్‌గాంధీకి మాలవీయ సలహా ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

