Vande Bharat Train | వందేభారత్ పై ఆగని దాడులు.. రైలుపై మరోసారి రాళ్లు రువ్విన ఆకతాయిలు
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని బారాబంకి (Barabanki)లో వందే భారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు (Stones thrown). గోరఖ్ పూర్ నుంచి లఖ్ నవూకు వెళ్తున్న రైలుపై బారబంకిలోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు ఆకతాయిలు రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఓ కోచ్ కిటికీ అద్దం పగిలింది. ఘటనపై రైల్వే రక్షణ దళం (Railway Protection Force) కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించింది. దీంతో బారాబంకి రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
కాగా, గత నెల 27వ తేదీన కూడా వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఆగ్రా రైల్వే డివిజన్ (Agra Railway Division)లోని భోపాల్ (Bhopal) నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ (Nizamuddin station) వరకు నడుస్తున్న వందేభారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో C-7 కోచ్‌లోని సీట్ నంబర్ 13-14 కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై రైల్వే బృందం విచారణ చేపట్టింది.
Also Read..
Samantha | గాయని చిన్మయి పిల్లలతో సమంత ఆటలు
Ayodhya Ram Temple | అయోధ్య ఆలయం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద తాళం తయారు చేసిన భక్తుడు
Rahul Gandhi | ఎంపీగా తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న రాహుల్.. అనర్హతను ఎత్తివేసిన దిగువ సభ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

