Vande Bharat Train | సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ దాడిలో ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మాల్దాలోని కుమార్‌గంజ్ స్టేషన్లో ఈ ఘటన జరిగిందని.. ఘటనపై విచారణ ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబరు 30న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఈ రైలును ప్రారంభించారు. ఇది దేశంలోని ఏడో వందేభారత్ రైలు. హౌరా-న్యూ జల్పాయిగురి స్టేషన్ల మధ్య ఇది నడుస్తోంది. రైలును ప్రారంభించి నాలుగు రోజులు కూడా కాకముందే ఈ రైలుపై దాడి జరగడం గమనార్హం.
West Bengal | Stones pelted at Vande Bharat Express connecting Howrah to New Jalpaiguri, 4 days after its launch. The incident took place near Malda station. pic.twitter.com/Nm3XOmffpR
— ANI (@ANI) January 3, 2023