Mana Shankara varaPrasad Garu | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి అసలైన పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవనుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా సినిమా నుంచి మాస్ అప్డేట్ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ సినిమా నుంచి ‘ఆర్ యూ రెడీ’ అంటూ సాగే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో చిరంజీవి తన మార్క్ గ్రేస్‌తో, వెంకటేష్ తనదైన స్టైల్‌తో సందడి చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కంప్లీట్ మాస్ సాంగ్‌ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నారు.